
స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది అంజలి. తాజాగా ఆమె లీడ్ రోల్‌లో మరో మూవీ ప్రారంభమైంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాలోడు’ ఫేమ్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మిస్తున్నారు.
శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ కలర్ ఫుల్ విజువల్స్ అందించనున్నారని, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామన్నారు.