కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంజన్‌‌కుమార్‌‌‌‌ బాధ్యతలు

కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంజన్‌‌కుమార్‌‌‌‌ బాధ్యతలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్‌‌కుమార్ బుధవారం కరీంనగర్ డీసీసీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన నిజామాబాద్‌‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌కుమార్‌‌‌‌గౌడ్‌‌ నుంచి నియామక పత్రం అందుకున్నారు. అనంతరం కరీంనగర్‌‌‌‌ డీసీసీ ఆఫీసులో తనకు కేటాయించిన చాంబర్‌‌‌‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ శ్రేణుల సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు.  

ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ అవకాశం కల్పించిన పార్టీ హైకమాండ్‌‌, సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంజన్ కుమార్‌‌కు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నం సత్యనారాయణ గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.