అర్కిటిక్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో అన్మోల్‌‌‌‌ సెమీస్‌‌‌‌తో సరి

అర్కిటిక్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో అన్మోల్‌‌‌‌ సెమీస్‌‌‌‌తో సరి

వాంటా (ఫిన్లాండ్‌‌‌‌): ఇండియా రైజింగ్‌‌‌‌ షట్లర్‌‌‌‌ అన్మోల్‌‌‌‌ ఖర్బ్‌‌‌‌.. అర్కిటిక్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో సెమీస్‌‌‌‌తోనే సరిపెట్టుకుంది. శనివారం (అక్టోబర్ 11) జరిగిన మ్యాచ్‌‌‌‌లో అన్మోల్‌‌‌‌ 10–21, 13–21తో అకానె యమగుచి (జపాన్‌‌‌‌) చేతిలో ఓడింది.

 టోర్నీ ఆరంభంలో టాప్‌‌‌‌ ప్లేయర్లను ఓడించిన అన్మోల్‌‌‌‌.. ఈ మ్యాచ్‌‌‌‌లో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 29 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో అకానె కొట్టిన స్మాష్‌‌‌‌లను, ర్యాలీలను తీయడంలో ఇబ్బందిపడింది. 7–3తో తొలి గేమ్‌‌‌‌ను మొదలుపెట్టిన యమగుచి 11–9తో నిలిచింది. 

మధ్యలో అన్మోల్‌‌‌‌ ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లినా.. బ్రేక్‌‌‌‌ తర్వాత యమగుచి 11 పాయింట్లలో పది గెలిచింది. రెండో గేమ్‌‌‌‌లోనూ యమగుచి ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు.