నాకేమైనా జరిగితే మోడీదే బాధ్యత : హాజారే

నాకేమైనా జరిగితే మోడీదే బాధ్యత : హాజారే

తనకేమైనా జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హాజారే. లోక్ పాల్ చట్టం అమలు, అన్ని రాష్ట్రాల్లో లోకా యుక్తాల నియామకం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు కోరుతూ హాజారే చేస్తున్న నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. మీడియాతో మాట్లాడిన హాజారే.. అగ్నికి ఆజ్యం పోసిన వాడిలా కాకుండా… సమస్యలు ఎదుర్కోన్న దీరుడిగా ప్రజలు తనను గుర్తుంచుకుంటారని అన్నారు. నాకేమైనా జరిగితే ప్రజలు ప్రధానమంత్రినే భాధ్యుడిగా భావిస్తారని అన్నారు. జన ఆందోళన సత్యాగ్రహ పేరిట మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలే గావ్ సిద్దిలో జనవరి 30న హాజారే నిరాహార దీక్ష ప్రారంభించారు…