జార్ఖండ్​ లీడర్​ అన్నపూర్ణ దేవికి కేంద్రమంత్రి పదవి

జార్ఖండ్​ లీడర్​ అన్నపూర్ణ దేవికి కేంద్రమంత్రి పదవి

న్యూఢిల్లీ :  జార్ఖండ్​లోని కొడెర్మా లోక్​సభ స్థానం నుంచి గెలిచిన అన్నపూర్ణ దేవికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1998లో ఆర్జేడీ నేత అయిన ఆమె భర్త రమేశ్ యాదవ్ సడెన్​గా చనిపోయారు. అప్పటిదాకా హోంమేకర్​గా ఉన్న ఆమె.. అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆర్జేడీ స్టేట్ చీఫ్​గా కూడా పనిచేశారు. 2005 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.

 2012లో ఇరిగేషన్ మంత్రిగా సేవలందించారు. 2019 లోక్​సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. కొడెర్మా లోక్​సభ నుంచి బరిలోకి దిగి జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) నేత బాబులాల్ మరాండీపై 4.55 లక్షల మెజారిటీతో గెలిచారు. ఓబీసీ కమ్యూనిటీ కావడంతో జార్ఖండ్​లో బీజేపీ మరింత బలోపేతమైంది. స్టేట్​లో 45% ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు.