
చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో యష్ రంగినేని నిర్మించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. జులై 21న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. చైతన్య రావ్ మాట్లాడుతూ ‘నా పాత్రలోని సెన్సిబిలిటీస్‌ను డైరెక్టర్ ముందే చెప్పారు. ఇలాంటి చాన్స్ దొరికినప్పుడు ఎక్కడా తప్పు చేయొద్దని అనుకున్నా’ అని చెప్పాడు.
‘గౌతమి పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది’ అంది లావణ్య. ‘టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టం లేని టైంలో కథను చెప్పాలనుకున్నాం. అందుకే రెట్రో ఫీలింగ్ కోసం ఎయిటీస్ బ్యాక్‌డ్రాప్ తీసుకున్నా. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు’ అని చెప్పాడు చెందు ముద్దు. యష్ రంగినేని మాట్లాడుతూ ‘నాకున్న ప్యాషన్‌తోనే చిన్న చిత్రాలు చేస్తున్నా. ‘పెళ్లి చూపులు’ లాంటి సినిమా లేకపోతే విజయ్ లాంటి మంచి నటుడ్ని అందరం మిస్ అయ్యే వాళ్లం. ఈ సినిమాను మేం నిజాయితీగా తీశాం’ అని చెప్పారు.