
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, మూడు పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ఫోర్త్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం’ అంటూ సాగే పెళ్లి పాటను కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్ కలిసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ‘పెళ్లి సందడి’ అంత విజయం సాధిస్తుందన్నారు రాఘవేంద్రరావు.
అందరికీ హాయిని కలిగించే సినిమా అన్నారు అల్లు అరవింద్. పెళ్లి వేడుకగా సాగిన పాట గుర్తుండిపోతుందన్నారు అశ్వినీదత్. ఈ ముగ్గురి సమక్షంలో సాంగ్ లాంచ్ అవడం ఆనందంగా ఉందన్నారు సంతోష్, మాళవిక, నందిని. స్వప్నదత్, ప్రియాంక దత్ పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి తదితరులు నటించిన ఈ చిత్రం మే 18న విడుదల కానుంది.