త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పై ప్రకటన

త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పై ప్రకటన

మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ పై ప్రకటన వస్తుందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నాశ్విల్లేలో జరిగిన చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్ లో ట్రంప్, జోబైడెన్ మాట్లాడారు. తనకు కరోనా వచ్చినా… వేగంగా కోలుకున్నానని ట్రంప్ చెప్పారు. కరోనాను అంతం చేయడానికి తన దగ్గర ప్లాన్ ఉందన్నారు బైడెన్.

కరోనాను సీరియస్ గా తీసుకోలేదన్న ట్రంప్ పై విమర్శలు చేశారు బైడెన్. కరోనాపై తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని… అయితే ఇది తన తప్పిదం కాదని చైనా ఫాల్ట్ అన్నారు. విదేశాల నుంచి సింగిల్ పెన్నీ కూడా తీసుకోలేదని బైడెన్ చెప్పగా… తాను మిలియన్ల కొద్ది డాలర్లు పన్నుగా చెల్లిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు.