కాణిపాకంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

 కాణిపాకంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా: కాణిపాకం వరసిద్ధి వినాయక  ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక  బ్రహ్మోత్సవాల్లో  భాగంగా  ఇవాళ ఆదివారం చిన్న శేష వాహన సేవ  నిర్వహించారు. ముందుగా చిన్న శేష  వాహనానికి  వెయ్యి ఒక్క కలశాలతో పుణ్యాహ వచనం మొదలైన  ప్రత్యేక  పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

సుందరంగా తీర్చిదిద్దిన శేష వాహనంపై వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరసిద్ది వినాయకుడు ఆశీనుడయ్యారు.  అనంతరం వాహన సేవను ఆలయ  ఛైర్మన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  భక్తులు భారీగా తరలివచ్చారు.