
హైదరాబాద్ పేలుళ్ల కుట్రకేసులో మరో నిందితుడికి జైలు శిక్ష పడింది. నిందితుడు సయ్యద్ మగ్బూల్కు పదేళ్ల జైలుశిక్ష విధించింది ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు. 2012 పాకిస్థాన్ నుంచి భారత్కు పేలుడు పదార్ధాలు తెచ్చి దాడులకు యత్నించిన కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ..ఈ కేసులో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్ చేసింది. జులైలో నలుగురు నిందితులు దినేష్ అన్సారి, ఆఫ్తాబ్ అలామ్, ఇమ్రాన్ ఖాన్, ఒబైద్ ఉర్ రెహమాన్ లకు పదేళ్ల జైలు శిక్ష పడగా.. తాజాగా ఐదో నిందితుడు మగ్బూల్ కి జైలు శిక్ష విధించింది ఢిల్లీ ఎన్ ఐఏ కోర్టు. ఈ కేసులో మరో ఆరుగురు నిందితులకు కోర్టులో ట్రయల్ కొనసాగుతోంది.
Accused Sentenced by NIA Special Court in Indian Mujahideen Conspiracy Case. pic.twitter.com/nzfKjjbPgj
— NIA India (@NIA_India) October 26, 2023