- గత 17 రోజుల్లోనే ఇది 12వ ఘటన
పాట్నా: బిహార్‌లో మరో బ్రిడ్జి కూలింది. సరెన్, సివాన్ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలను కలిపే గండకి నదిపై ఉన్న 15 ఏండ్ల నాటి వంతెన కూలిపోయింది. తాజా ఘటనతో గడిచిన 24 గంటల్లో సరెన్ జిల్లాలో కూలిన బ్రిడ్జిల సంఖ్య మూడుకు చేరింది. అంతేగాక, రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజుల వ్యవధిలో కూలిన బ్రిడ్జిల సంఖ్య12కు చేరింది. గండకి నదిపై మొత్తం మూడు బ్రిడ్జిలు ఉండగా.. కిలోమీటరు దూరంలోనే ఉన్న రెండు బ్రిడ్జిలు బుధవారం కూలిపోయాయి.
మిగిలిన ఒక్కటి కూడా గురువారం కూలింది. భారీ వర్షాల కారణంగానే వంతెనలు దెబ్బతిని కూలుతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న పాత, కొత్త వంతెనలను అన్నింటినీ పరిశీలించి దెబ్బతిన్నవాటికి వెంటనే రిపేర్లు పూర్తి చేయాలని అధికారులను బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదేశించారు. బ్రిడ్జిల నిర్వహణ విధానాలను మరింత మెరుగుపరచాలని స్పష్టం చేశారు.
