కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు నమోదు..

కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు నమోదు..

మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు, కల్వకుంట్ల కన్నా రావుపై మరో కేసు నమోదైంది. ఒక  ల్యాండ్ సెటిల్మెంట్ కోసం వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లోనే దొంగతనం చేశారని బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయ వర్ధన్  రావు అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి లాండ్ సెటిల్మెంట్ కోసం కన్నా రావు వద్దకు వెళ్లాడు. విజయవర్ధన్‌రావు వద్ద నగలు, నగదు ఉన్నాయని తెలుసుకుని అతిన ఇంట్లో చోరీ చేశారు.

బిందు మాధవి అలియాస్ నందిని అనే మహిళతో కలిసి ఈ అరాచకానికి పాల్పడ్డారు. రూ. 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కన్నారావుతో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నారావు, బిందు మాధురి, శ్యామ్ ప్రసాద్, సంతోష్ నడిపెల్లి, తులసి రాంపై కేసు నమోదైనట్టు తెలిపారు.

అప్పటి ఏసీపీ భుజంగ రావు సైతం కన్నారావుకు సహకరించాలని సాఫ్ట్‌వేర్‌ తెలిపాడు. ఇంజనీర్‌పై ఒత్తిడి తెచ్చారు. కన్నారావుకు సహకరించాలని లేకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని భుజంగ రావు తనను బెదిరించినట్లు బాధితుడు తెలిపారు.  గతంలోనూ బిందు మాధురిపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.