
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లి చదవాలనుకుని జేఈఈ మెయిన్స్ 2000కు అప్లికేషన్ పెట్టుకోలేకపోయిన స్టూడెంట్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ స్టూడెంట్స్ కు జేఈఈ మెయిన్స్‌కు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న నేషనల్‌టెస్టింగ్‌ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. అప్లికేషన్విండోను మంగళవారం నుంచి రీఓపెన్ చేస్తున్నట్టు హెచ్ఆర్డీ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చామన్నారు. జులై 18 నుంచి 23 వరకు దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది.