
- జనవరి ఫస్ట్తర్వాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు
- నాలుగేండ్ల పాటు కొనసాగిన పనులు
- 2.2 కి.మీ మేర నిర్మాణానికి రూ.263 కోట్ల ఖర్చు
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్, అండర్‌పాస్ అందుబాటులోకి రానుంది. ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ రద్దీ నుంచి కొంత మేర ఉపశమనం లభించనుంది. కొండాపూర్ నుంచి కొత్తగూడ జంక్షన్మీదుగా బొటానికల్ గార్డెన్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్లో అండస్పాస్పనులు 95 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 25 లోపు పనులు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్న అధికారులు మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
నాలుగేండ్లుగా సాగిన ఫ్లైఓవర్ పనులు
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎస్ఆర్డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్)లో భాగంగా కొండాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్‌వరకు 2.2 కి.మీ. మేర ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో శ్రీకారం చుట్టింది. రూ.199 కోట్ల నిధులు కేటాయించింది. 2020 ఏప్రిల్ నాటికి పనులు కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని మొదట భావించగా, మధ్యలో కొవిడ్, ఆస్తుల సేకరణ కారణంగా లేట్అయ్యింది. అలాగే కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన బిల్లులు లేట్ అవ్వడంతో పనులు ఆలస్యం అయ్యాయి. రెండేళ్లలో కంప్లీట్ చేయాల్సిన పనులు నాలుగేండ్లు పట్టాయి. ప్రాజెక్టు వ్యయం రూ.199 కోట్ల నుంచి రూ.263 కోట్లకు చేరింది. నిర్మాణ పనులు జరిగినన్ని రోజులు వాహనదారులు ట్రాఫిక్‌తో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం పనులు పూర్తికావడంతో ఇకపై ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని సంతోషం వ్యక్తం
చేస్తున్నారు. న్యూఇయర్‌లో ఫ్లైఓవర్, అండర్‌పాస్ ను ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ పెయింటింగ్ పనులు నడుస్తున్నాయి. గూగుల్ఆఫీస్నుంచి కొత్తగూడ జంక్షన్ మీదుగా బొటానికల్ గార్డెన్ వైపు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ట్రాఫిక్ తగ్గుద్ది
కొండాపూర్ నుంచి గచ్చిబౌలిలోని ఆఫీసుకు వెళ్లేందుకు గంట టైమ్ పడుతోంది. ట్రాఫిక్‌లో నరకం కనిపిస్తోంది. డైలీ ఆఫీస్‌కు లేట్ అవుతోంది. ఫ్లైఓవర్, అండర్ పాస్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ తగ్గుతుంది. కొంత ఉపశమనం లభిస్తుంది.
25 లోపు కంప్లీట్ చేస్తం
పనులు మొత్తం పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం పెయింటింగ్వర్క్ జరుగుతోంది. ఈ నెల 25 లోపు మొత్తం పనులు కంప్లీట్ చేస్తాం.
- పరమేశ్వర్, ఏఈ, ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్