మలయాళ స్టార్ మోహన్‌‌లాల్‌‌కు మరో గొప్ప గౌరవం

మలయాళ స్టార్ మోహన్‌‌లాల్‌‌కు మరో గొప్ప గౌరవం

ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మలయాళ స్టార్ మోహన్‌‌లాల్‌‌కు మరో గొప్ప గౌరవం దక్కింది.  ఇండియన్‌‌ ఆర్మీ చీఫ్​ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా సీవోఏఎస్‌‌ కమెండేషన్‌‌ కార్డ్‌‌ను ఆయన అందుకున్నారు. గత పదహారేళ్లుగా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌‌ హోదాలో మోహన్ లాల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలోని ఆర్మీ హెడ్‌‌ క్వార్టర్స్‌‌లో ఏడుగురు ఆర్మీ కమాండర్స్‌‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. గౌరవ లెఫ్టినెంట్‌‌ కల్నల్‌‌గా ఈ గుర్తింపు పొందడం ఎంతో గర్వంగా, కృతజ్ఞతతో కూడిన క్షణం అని మోహన్‌‌ లాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.