వాట్సాప్‎లో మరో కొత్త ఫీచర్.. గ్రూప్​చాట్స్‎కి ఎంతో యూజ్‎ఫుల్

వాట్సాప్‎లో మరో కొత్త ఫీచర్.. గ్రూప్​చాట్స్‎కి ఎంతో యూజ్‎ఫుల్

వాట్సాప్‎లో వాయిస్​చాట్ అనే కొత్త ఫీచర్ వచ్చేసింది. ఇది గ్రూప్​చాట్స్‎కి బాగా ఉపయోగపడుతుంది. దీనిద్వారా రియల్ టైం ఆడియో చాట్ చేయొచ్చు. సెలక్టివ్ మెంబర్స్‎తో లైవ్ ఆడియో చాటింగ్​చేయొచ్చు. యూజర్లు గ్రూప్‎లో ఎప్పుడైనా లైవ్ కనెక్ట్ కావొచ్చు కూడా. యూజర్లు గ్రూప్​కాల్ చేయాల్సిన పని ఉండదు. దీన్ని ఎలా వాడాలంటే.. వాట్సాప్‎లో ఏదైనా గ్రూప్ ఓపెన్ చేసి కింద నుంచి పైకి స్వైప్ చేయాలి. 

తర్వాత కాసేపు స్వైప్‎ను హోల్డ్ చేయాలి. దాంతో వాయిస్ చాట్ యాక్టివేట్ అవుతుంది. ఇందులో నార్మల్ గ్రూప్ కాల్స్ లాగ ప్రతీ మెంబర్​కి రింగ్ వెళ్లదు. ఇది యాక్టివేట్ అయిన తర్వాత చాట్ కింద ఉంటుంది. అందువల్ల గ్రూప్ మెంబర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ అవ్వొచ్చు లేదా ఎగ్జిట్ కావొచ్చు. వాయిస్​చాట్​ఫీచర్​లో కూడా ఎండ్ – టు – ఎండ్ ఎన్​ క్రిప్ట్​అయి ఉంటాయి. కాబట్టి ఇది పూర్తిగా సేఫ్.