తెలంగాణలో మరో కొత్త జర్నలిస్ట్ సంఘం ఏర్పాటు : ఎంవీ రమణ

తెలంగాణలో మరో కొత్త జర్నలిస్ట్ సంఘం ఏర్పాటు :   ఎంవీ రమణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో కొత్త జర్నలిస్ట్ సంఘం ఏర్పడింది. ఆదివారం హైదరాబాద్‌‌‌‌ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌‌‌‌లో ఉమ్మడి జిల్లాల జర్నలిస్ట్ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కొండల్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ (జస్ట్) ఏర్పడింది. సంఘం కన్వీనర్‌‌‌‌‌‌‌‌గా ఎంవీ రమణ, కో కన్వీనర్లుగా పీవీ శ్రీనివాస్, జమాల్పూర్ గణేశ్‌‌‌‌, బిజిగిరి శ్రీనివాస్, శశికాంత్, మల్లీశ్వరి, నాంపల్లి మురళి, సలహాదారుగా కొండల్ రావు ఎన్నికయ్యారు. 

గుంటిపల్లి వెంకట్ స్టేట్ కో కన్వీనర్‌‌‌‌‌‌‌‌తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్‌‌‌‌చార్జిగా వ్యవహరించనున్నారు. స్టేట్ అడ్‌‌‌‌హాక్ కమిటీ సభ్యులుగా కొండల్ గౌడ్ (హైదరాబాద్), గోపాలకృష్ణ (కరీంనగర్), నర్సింహచారి (నిజామాబాద్), లక్ష్మీనారాయణ (రంగారెడ్డి), బస్వరాజ్ (మహబూబ్‌‌‌‌నగర్), యోగనంద్ రెడ్డి (మెదక్), క్రాంతి(నల్గొండ), రాజేశ్‌‌‌‌ (ఆదిలాబాద్) ఎన్నికయ్యారు. అడ్‌‌‌‌హాక్ కమిటీ సభ్యులు సంబంధిత జిల్లాల ఇన్‌‌‌‌చార్జిలుగా వ్యవహరించనున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి పనిచేస్తామని కన్వీనర్ రమణ ప్రకటించారు.