సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. హోటల్‌లో యువనటి సూసైడ్

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. హోటల్‌లో యువనటి సూసైడ్

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని భోజ్పురి ఇండస్ట్రీకి చెందిన నటి ఆకాంక్ష దూబే (25).. వారణాసిలోని ఓ హోటల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో భోజ్పురి చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. 

విచారణ చేపట్టిన పోలీసులు.. ఆకాంక్ష ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే కోణంలో విచారిస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆకాంక్ష.. డ్యాన్స్ రీల్స్ తో అభిమానులను అలరించేది. ఆత్మహత్య చేసుకునేందుకు కొన్ని గంటల ముందే.. ఆకాంక్ష పవన్ సింగ్ తో కలిసి చేసిన మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. 

వాలెంటైన్స్ డే సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అప్ డేట్ ఇచ్చింది. తన సహనటుడు సమర్ సింగ్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుపుతూ.. ఇద్దరి ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే, ఆకాంక్ష 2018 నుంచి డిప్రెషన్ తో బాధపడుతుంది. దాంతో కొన్ని రోజులు సినిమాలకు విరామం తీసుకుని తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆకాంక్ష.. మేరీ జంగ్ మేరా ఫైస్లా, కరోగి (భోజ్పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 వంటి చిత్రాల్లో నటించింది.