16 ఏళ్ల పైబడిన వారికోసం మరో వ్యాక్సిన్

16 ఏళ్ల పైబడిన వారికోసం మరో వ్యాక్సిన్

దేశంలో కరోనావైరస్ తీవ్రత పెరుగుతుండటంతో అందరూ వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. పైగా.. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. వ్యాక్సిన్‌కు మరింత కొరత ఏర్పడింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 16 ఏళ్లు పైబడిన వారికోసం MRNA టీకాను తయారుచేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ టీకా ఆమోదం కోసం ఫైజర్, బయో ఎన్‌టెక్ సంస్థలు ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకున్నాయి. MRNA టీకాను అందుబాటులోకి తీసుకురావడానికి అనుమతులివ్వాలంటూ అమెరికాలోని ఎఫ్‌డీఏకు సదరు వ్యాక్పిన్ తయారీ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ అనుమతిస్తే.. 16 నుంచి 45 ఏళ్లలోపు వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే 170 మిలియన్ డోసులు సరఫరా చేసినట్లు కంపెనీలు తెలిపాయి.