‘అంటే సుందరానికీ’ నుంచి అప్డేట్ 

‘అంటే సుందరానికీ’ నుంచి అప్డేట్ 

హైదరాబాద్: ప్రేక్షకుల్ని హాస్యంతో గిలిగింతలు పెడుతుంటాడు హీరో నాని. ఎమోషనల్, సీరియస్ సీన్లలో ఎంత బాగా నటిస్తాడో.. తనదైన కామెడీ టైమింగ్ తోనూ అంతే బాగా నవ్విస్తుంటాడు. అలాంటి నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ‘బ్రోచేవారెవరురా’తో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఫిబ్రవరి 24న న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ‘బర్త్ డే హోమం’ పేరుతో పంచుకున్న ఈ వీడియోకు మంచి అప్లాజ్ వస్తోంది.

‘పుట్టినరోజున ఏంటి ఇది? ఇంకో రెండు హోమాలు చేస్తే గిన్నిస్ బుక్ ఎక్కొచ్చు’ అంటూ నాని చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ జూన్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంతో మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. 

మరిన్ని వార్తల కోసం..

ప‌వ‌న్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

ప్రియాంకకు బీజేపీ కార్య‌క‌ర్త షేక్ హ్యాండ్

‘గంగూబాయి’ విడుదలకు తొలగిన అడ్డంకులు