సరిలేరులో అంథెమ్ సాంగ్ వచ్చేసింది

సరిలేరులో అంథెమ్ సాంగ్ వచ్చేసింది

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి-11న రిలీజ్ కానున్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక్కో సాంగ్ ను ప్రతి సోమవారం రిలీజ్ చేస్తూ మూవీపై అంచనాలను పెంచుతూ వస్తుంది.

సోమవారం సరిలేరు నీకెవ్వరు అంథెమ్ సాంగ్ రిలీజ్ చేసింది యూనిట్. దేవీశ్రీ మ్యూజిక్ లో హీరో మహేష్ ను అద్భుతంగా చూపించారు. ఇప్పటికే రిలీజైన పాటలు ఆకట్టుకుంటుండగా.. ఇవాళ వచ్చిన అంథెమ్ సాంగ్ సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్. మహేస్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విజయశాంతీ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.