
- పోటీ పరీక్షల్లో అవకతవకల్ని అరికట్టేందుకే..
- బీహార్ అసెంబ్లీలో బిల్లు ఆమోదం
పట్నా: పేపర్ లీకేజీలు, ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకల్ని అరికట్టేందుకు బీహార్ అసెంబ్లీ కీలక బిల్లును ఆమోదించింది. బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు-2024ను మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ప్రవేశపెట్టగా.. ప్రతిపక్షాల వాకౌట్ మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. దీని ప్రకారం ఆయా పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారికి 3 నుంచి 5 ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ.10లక్షల జరిమానాతో పాటు కఠినంగా శిక్షించనున్నారు. నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్, అక్రమాల ఆరోపణలపై చెలరేగిన వివాదానికి బిహార్ కేంద్ర బిందువుగా ఉన్న నేపథ్యంలో పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గమనార్హం.