
బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని చెప్తున్నా ఏపీ ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. లక్షల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించినా ప్రయోజనం లేదు.. పైగా అది ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందనంటున్నాఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నా డోంట్ కేర్ అంటోంది టీడీపీ ప్రభుత్వం. బనకచర్ల ఏపీ ప్రజల ప్రయోజనాలకోసం కాదు.. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయినా పోలవరం పూర్తయితే తప్ప నీటి చుక్క కూడా తరలించే పరిస్థితి లేనప్పటికీ చంద్రబాబు మాత్రం బనకచర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పడంపై ఏపీలో ఇరిగేషన్ నిపుణులు, మేధావులు, ఆర్థికవేత్తల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది.
ALSO READ | బనకచర్ల ఏపీకి గుదిబండే..మేఘా కంపెనీ కోసమే అంటున్న ఏబీ వెంకటేశ్వరరావు
ఈ క్రమం లోనే బనకచర్లకు వ్యతిరేకంగా విజయవాడ కేంద్రంగా ఇటీవల ఆలోచనాపరుల వేదిక పురుడుపోసుకుంది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వేదిక బాధ్యులు మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వర్ రావు, కంభంపాటి పాపా రావు, అక్కినేని భవాని ప్రసాద్, టి.లక్ష్మీ నారా యణ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి న ఏపీపై బనకచర్ల ప్రాజెక్టు మరో గుదిబండలా మారబోతోందని, అందుకే ప్రాజెక్టును అడ్డుకోవా లని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.
బనకచర్ల ప్రాజెక్టు ను నాటి సీఎంలు కేసీఆర్, జగన్, ఓ బడా కాంట్రా క్టర్ కలిసి మొదలు పెట్టారని.. ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్నారని ఇటీవల ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో కేవలం కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజ నం లేదని స్పష్టం చేస్తున్నారు.
కాగా, ఆలోచనా పరుల వేదిక సభ్యులు ఆరోపిస్తున్నట్లే ఏపీ ప్రభు త్వం వ్యవహారశైలి ఉంది. వాస్తవానికి బనకచర్ల ప్రాజెక్టును తొలుత ప్రతిపాదించినప్పుడు అంచ నా వ్యయాన్ని కేవలం రూ.80,112 కోట్లుగా ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కానీ, కేంద్రానికి సమర్పిం చిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో మాత్రం దానిని రూ.81,900 కోట్లకు పెంచింది. కేవలం రెండు మూడు నెలల వ్యవధిలోనే అంచనాలను రూ.1800 కోట్లదాకా పెంచడం గమనార్హం.