
బనక చర్ల ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చు ఏపీ ప్రజలకు గుదిబండలా మారుతుంది.. కేవలం కాంట్రాక్టర్ల కోసమే చేపట్టే ఈ ప్రాజెక్టుతో ఏపీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయింది.. మేం పోలవరం భూనిర్వాసితుల సమస్యలను తీరుస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు..ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు పేరుతో మరో డ్రామాకు తెరలేపారని ఏపీ ప్రజలు, మేధావులు, ఇరిగేషన్ నిపుణులు, మేధావులు, ఆర్థికవేత్తల నుంచి వ్యతిరేకత వస్తోంది..
గత వైఎస్సార్ సీపీ సర్కార్ చేతగానితనం వల్లే పోలవరం పూర్తి కాలేదు. నేను అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి, నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తా’ అని మాత్రమే గత ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకే ఎన్డీయేలో చేరుతున్నామని కొత్తలో చెప్పారు.
ALSO READ : బనకచర్లకోసం ఏపీ రూ.82వేల కోట్ల అప్పుకు రెడీ
ఏపీ ప్రజలు ఇదే నిజమని నమ్మారు. తీరా చూస్తే గతంలో ఎన్నడూ వినని బనకచర్ల ప్రాజెక్టును తెరమీదికి తీసుకొచ్చారు. చంద్రబాబు మనసు ఎందుకు మారిందో అర్థం కావడం లేదు. ఈ బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలపై గుదిబండలా మారబోతోంది.
- నేతాజీ, సీపీఎం సెక్రటరీ, ఉమ్మడి గుంటూరు జిల్లా
మేఘా కంపెనీ కోసమే
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి బనకచర్ల ప్రాజె క్టును ప్లాన్ చేశారు. నాటి వైసీపీ, నేటి టీడీపీ ప్రభుత్వానికి అనుసంధానమైన అగర్ బత్తీ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. ఈ కాంట్రాక్ట్సంస్థ కోసమే ప్రాజెక్టు కడ్తు న్నట్లు ఉంది. ఏపీ ప్రజలకు ఈ ప్రాజెక్టు నిజస్వరూపం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
- ఏబీ వెంకటేశ్వరావు, రిటైర్డ్ డీజీ, ఆలోచనపరుల వేదిక