అడ్డగోలుగా పేషెంట్లకు .. యాంటిబయాటిక్స్ ఇస్తున్నరు

అడ్డగోలుగా  పేషెంట్లకు .. యాంటిబయాటిక్స్ ఇస్తున్నరు
  • ఉస్మానియా సహా దేశంలోని 20 దవాఖాన్లలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీసీ సర్వే  
  • ఉస్మానియా సహా దేశంలోని 
  • 20 దవాఖాన్లలో ఎన్‌‌సీడీసీ సర్వే 
  • 6 శాతం మంది పేషెంట్లకే డయాగ్నసిస్‌‌ 
  • 94% మందికి అంచనాతోనే యాంటిబయాటిక్స్ రాస్తున్న డాక్టర్లు   
  • విచ్చలవిడి వాడకం ప్రమాదమని హెచ్చరిస్తున్న నిపుణులు

హైదరాబాద్, వెలుగు:  దేశంలో సుమారు 94 శాతం మంది పేషెంట్లకు సరైన రోగ నిర్ధారణ చేయకుండానే డాక్టర్లు యాంటిబయాటిక్స్ రాస్తున్నారని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీసీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 20 ప్రముఖ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేసిన సర్వే ఫలితాలను ఇటీవల ప్రకటించింది. ఈ హాస్పిటళ్లలో మన ఉస్మానియా దవాఖాన కూడా ఉంది. సర్వేలో భాగంగా ఈ 20 హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్మిటైన 11,588 మంది పేషెంట్ల ప్రిస్క్రిప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సర్వే బృందాలు పరిశీలించాయి. ఇందులో 9,652 మంది పేషెంట్లకు యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసినట్టు గుర్తించారు. రోగం తగ్గడానికి వాడాల్సిన యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, రోగం రాకుండా నిరోధించేందుకు ప్రివెంటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డాక్టర్లు రాస్తున్నారని సర్వేలో వెల్లడైంది. మొత్తం 45 శాతం మంది పేషెంట్లకు ప్రివెంటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా యాంటిబయాటిక్స్ రాశారని పేర్కొంది. 6 శాతం మంది పేషెంట్లకు మాత్రమే సరియైన రోగ నిర్ధారణ చేసి, రోగానికి కారణమైన బ్యాక్టీరియా ఏంటో కనుగొని ఆ బ్యాక్టీరియాపై పోరాడేందుకు అవసరమైన యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాశారని తెలిపింది. మిగిలిన వారికి డాక్టర్లు తమ అనుభవాన్ని ఉపయోగించి, రోగి లక్షణాలను బట్టి యాంటిబయాటిక్స్ ఇచ్చారని వివరించింది. ఇలా విచ్చలవిడిగా యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగించడం వల్లే, బ్యాక్టీరియాలపై ఆ మందులు పని చేయని పరిస్థితి (యాంటిబయాటిక్స్ రెసిస్టెన్స్) వస్తోందని సర్వే రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. 

మూడో స్థానంలో తెలంగాణ

యాంటిబయాటిక్స్ అతిగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇండియా, బోస్టన్ యూనివర్సిటీ 2011 నుంచి 2019 వరకూ చేసిన స్టడీలో ఈ విషయం తేలింది. ఈ సర్వే ఫలితాలను గతేడాది వెల్లడించారు. ఇప్పుడు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీసీ సర్వేలోనూ దాదాపు మన స్టేట్ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే, ఈసారి ఏయే రాష్ట్రంలో ఏ మోతాదులో వినియోగం ఉందనే విషయాన్నే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీసీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొనలేదు. కానీ, మన డాక్టర్లు మాత్రం రాష్ట్రంలో యాంటిబయాటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతోందని చెబుతున్నారు.   

రివర్స్ ట్రెండ్

యాంటిబయాటిక్ మందులను కనుగొనక ముందు చిన్న చిన్న రోగాలకే జనం ప్రాణాలు కోల్పోయేవారు. యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనుగొన్నాక టీబీ, కుష్టు వంటి పెద్ద రోగాల నుంచి కూడా లక్షల మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఇప్పుడు మళ్లీ చిన్న చిన్న రోగాలకే ప్రాణాలు కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు వస్తున్నాయి. యాంటిబయాటిక్స్ ను విచ్చలవిడిగా వాడటమే ఇందుకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. దగ్గు, జలుబుకు కూడా జనాలు యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడుతుండడంతో రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దారి తీస్తోంది. తింటూ ఉంటే వేప తియ్యగైనట్టు, బ్యాక్టీరియాలు యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తట్టుకునే శక్తిని సంతరించుకుంటున్నాయి. దీంతో ఏదో పెద్ద రోగం వచ్చి, అవసరమైనప్పుడు యాంటిబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండట్లేదు. ప్రస్తుతం టీబీ మరణాల్లో 50% యాంటిబయాటిక్ రెసిస్టెన్స్ వల్లే సంభవిస్తున్నాయని చెప్తున్నారు. 

అడ్డగోలుగా పంచుతున్నరు

వాస్తవానికి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ కాస్మోటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్ ప్రకారం డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిస్కిప్షన్ లేకుండా యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మడానికి వీలులేదు. కానీ, రాష్ర్టంలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో అమోక్సిసిలిన్, సెఫిక్సిమ్, సిఫ్రాన్, మెట్రోనిడజోల్ తదితర యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. మెడికల్ షాపులను నియంత్రించాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక గ్రామాల్లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీలు, పీఎంపీలు.. క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా చిన్న చిన్న రోగాలకే అధిక డోస్ యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రోగులకు అంటగడుతున్నారు. ఫార్మా కంపెనీల కమీషన్లకు ఆశపడి, జ్వరం, చిన్న చిన్న గాయాలకు సైతం మెరోపీనం వంటి అధిక డోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాంటిబయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. ఒకటి రెండుసార్లు ఇలా హై డోస్ వాడితే, ఆ తర్వాత తక్కువ డోస్ యాంటిబయాటిక్స్ ఇచ్చినా పనిచేయవు. కొంతకాలానికి రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

టెస్ట్ చేశాకే ఇయ్యాలి 

వ్యక్తి శరీరతత్వాన్ని, రోగాన్ని బట్టి యాంటిబయాటిక్స్ ఇచ్చేందుకు బ్లడ్ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్లడ్ సెన్సిటివిటీ ఫలితాలను బట్టి ఎంత డోస్ యాంటిబయాటిక్స్ ఇవ్వాల్నో నిర్ణయిస్తారు. నాలుగైదు దవాఖాన్లు ఈ పద్ధతిని పాటిస్తు న్నాయి. గతంలో నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాంటి బయాటిక్స్ స్టెవార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట ఓ కార్య క్రమం ప్రారంభించారు. యాంటి బయాటిక్స్ రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రోగులకు, డాక్టర్లకు అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం. కానీ, ఎవరూ దీన్ని పాటించడం లేదు.

25 నుంచి 40% మరణాలు 

రాష్ర్టంలో ఏటా 70 వేల మంది టీబీ బారిన పడుతున్నారు. ఇందులో 5 నుంచి 8 వేల మంది మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీబీ (ఎండీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీబీ) బారినపడుతున్నారు. సాధారణ టీబీ వచ్చినవాళ్లలో మరణాల రేటు 2 నుంచి 3%  ఉంటే, డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీబీ వచ్చినవాళ్లలో 25 నుంచి 40% మంది చనిపోతున్నారు. యాంటిబయాటిక్స్ సక్రమంగా వినియోగించకపోయినా రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బారినపడే ప్రమాదముంటుంది. టీబీ పేషెంట్లలో చాలా మంది వ్యాధి కొంత తగ్గగానే ట్యాబ్లెట్లు మానేస్తున్నారు. దీంతో టీబీ తిరగబె ట్టినప్పుడు వాళ్లకు మరోసారి మందులు ఇచ్చినా పని చేయడం లేదు. దీనివల్లే అధిక శాతం టీబీ మర ణాలు జరుగుతున్నాయి. షుగర్ పేషెంట్లకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో గాయా లైనా, ఏదైనా జబ్బు చేసినా తొందరగా రికవరీ అవ్వరు. ఇలాంటి వాళ్లకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీ, పీఎంపీలు హై డోస్ యాంటిబయాటిక్స్ ఇచ్చి, వాళ్లను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.