దేశంలో 67% మందిలో యాంటీబాడీలు

దేశంలో 67% మందిలో యాంటీబాడీలు
  • 6 నుంచి 17 ఏండ్లు ఉన్నవారిలో గుర్తించిన ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: దేశంలోని ఆరేండ్లపైన ఉన్నోళ్లలో 67.6 శాతం మందిలో కరోనా యాంటీ బాడీలున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 40 కోట్ల మందికి మహమ్మారి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. మంగళవారం నాలుగో సీరో సర్వే ఫలితాలను ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​(ఐసీఎంఆర్​) డైరెక్టర్​ డాక్టర్​ బలరాం భార్గవ ప్రకటించారు. కరోనా రూల్స్​ను ప్రతిఒక్కరూ పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే ముప్పు తప్పదని హెచ్చరించారు. 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 36,227 మందిపై సీరో సర్వే చేసినట్టు ఆయన చెప్పారు. అందులో 7,252 మంది ఆరోగ్య సిబ్బంది ఉన్నారన్నారు. ఆరు నుంచి 17 ఏండ్ల మధ్య ఉన్న సగం మంది చిన్నారుల్లోనూ యాంటీబాడీలు ఉన్నాయన్నారు. 85% మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా వచ్చిందన్నారు. సెకండ్​ వేవ్​ ప్రారంభానికి ముందు జూన్‌‌‌‌, జులైలో చేసిన ఈ సర్వే ద్వారా.. పదేండ్లపైన ఉన్నోళ్లలో కేవలం 21% మందే కరోనా బారిన పడ్డారని తేల్చారు. 2 డోసుల టీకా​ వేసుకుంటేనే ప్రయాణాలు చేయాలన్నారు. పిల్లల్లో ఏసీఈ రిసెప్టర్లు తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి.. వారికి వైరస్​ సోకే ముప్పు చాలా తక్కువని డాక్టర్​ బలరాం భార్గవ వివరించారు.