రైస్ బ్రాన్ ఆయిల్​లో.. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ

రైస్ బ్రాన్ ఆయిల్​లో..  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ
  • గుండెకు మంచిదంటున్న ఫ్రీడమ్‌ 

హైదరాబాద్​, వెలుగు:  నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యకరమైన జీవనశైలి అత్యంత కీలకంగా మారింది. ఆరోగ్య సంరక్షణలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. మంచి ఆహారం కావాలంటే సరైన  వంట నూనె  కావాలి. ఈ విషయంలో  నిపుణులు రైస్ బ్రాన్ ఆయిల్​కు ఓటేస్తున్నారు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్​ను బియ్యం గింజల పైపొర నుంచి తీస్తారు. ఒరైజనల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌‌ను పెంచుతుంది. అధిక స్మోక్ పాయింట్‌‌ కారణంగా సాటింగ్, ఫ్రైయింగ్,  బేకింగ్‌‌తో సహా అనేక రకాల వంట పద్ధతులకు ఇది బాగా సరిపోతుంది. పోషకాహార నిపుణులు , డాక్టర్ మతీన్ అస్రార్ మాట్లాడుతూ, "వంట నూనెలు మన శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, కొవ్వులో కరిగే విటమిన్లు  ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. 

ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కణాల పనితీరును నిర్వహించడానికి, మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి,  పోషకాల శోషణకు తోడ్పడతాయి.  రైస్ బ్రాన్ ఆయిల్‌‌లో ఉండే కొవ్వు, ఆమ్లాల  నిర్దిష్ట కలయిక గుండెకు మేలు చేస్తుంది. రైస్​బ్రాన్​ ఆయిల్​లోని ఒరైజనల్ , టోకోఫెరాల్,  టోకోట్రియనాల్‌‌ సహజ యాంటీఆక్సిడెంట్లు, చెడు కొలెస్ట్రాల్ (ఎల్​డీఎల్​)ను తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే మేం రైస్ బ్రాన్ ఆయిల్‌‌ను ఉపయోగించాలని సిఫార్సు చేస్తుంటాం" అని అన్నారు. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్, సేల్స్ & మార్కెటింగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్ర శేఖర రెడ్డి మాట్లాడుతూ , “ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ కేవలం రుచికరమైన వంటలకు అనువైనదే కాకుండా ఆరోగ్యానికి మంచి చేస్తుంది.  ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారులకు నమ్మకమైన బ్రాండ్​ మాది. రైస్​బ్రాన్​ ఆయిల్​లోని పోషక విలువలు,  సహజ యాంటీఆక్సిడెంట్‌‌లను సంరక్షించడానికి మేం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం”అని అన్నారు.