బోర్ కొడితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో అంత్యాక్షరి ఆడతారు చాలామంది. ఎన్నో పాటల్ని గుర్తు తెచ్చుకుని మరీ పాడతారు అప్పుడు. అందరికీ ఇష్టమైన ఈ ఫన్నీ గేమ్ త్వరలోనే మళ్లీ టీవీ షోగా రాబోతోంది. 1994లో ‘అంత్యాక్షరి’ పేరుతో జీ టీవీలో హిందీలో వచ్చిన మ్యూజికల్ రియాలిటీ షో పెద్ద హిట్. దాదాపు 12 ఏండ్లు ఆడియెన్స్‌ని మస్త్ ఎంటర్టైన్ చేసింది ఈ షో. అప్పట్లో ఈ షోకి రేడియో జాకీ అన్నూకపూర్ హోస్ట్. “ఈ షోని మళ్లీ టెలికాస్ట్ చేసేందుకు ఛానెల్ వాళ్లతో మాట్లాడుతున్నాం. షో దాదాపు ఇంతకుముందులానే ఉంటుంది. అయితే కొత్తవాళ్లని తీసుకొని, కొత్తగా ఆడియెన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పాడు అంత్యాక్షరి షో నిర్మాత గజేంద్ర సింగ్. ఇప్పటివరకైతే ఈ షో ఏ ఛానెల్లో టెలికాస్ట్ అవుతుందనేది అనౌన్స్ చేయలేదు.
