హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా అనూప్ బాగ్చీ

హెచ్డీఎఫ్సీ బ్యాంక్  సీఈఓగా అనూప్ బాగ్చీ

న్యూఢిల్లీ:హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా అనూప్ బాగ్చీ నియమితులయ్యారు. మూడేళ్ల కాలపరిమితికి ఆర్​బీఐ ఆయన నియామకాన్ని,  వేతనాన్ని ఆమోదించింది. ఈ పదవీకాలం 2026 అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంక్ బోర్డు సమావేశంలో శుక్రవారం నుంచి ఆయనను అదనపు డైరెక్టర్​గానూ నియమించారు. 

బాగ్చీ ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓగా పనిచేస్తున్నారు. 2023 జూన్ నుంచి ఆయన ఈ బాధ్యతల్లో ఉన్నారు. దాదాపు 30 ఏళ్లు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో పనిచేసిన ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ రిటైర్​ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ మేనేజ్​​మెంట్​లో మార్పులు జరిగాయి. 

గత నెల జిమ్మీ టాటాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా,  శ్రీనివాస రంగన్​ను హోల్​టైమ్ డైరెక్టర్​గా బ్యాంక్ తిరిగి నియమించింది. ఈ ఏడాది జూన్ 29న రాజీవ్ కుమార్ పార్ట్​టైం చైర్మన్​గా నియమితులయ్యారు.