విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పూణేలోని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో ఖషబా జాదవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన ఖషబా జాదవ్, స్వామి వివేకానంద విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో వివిధ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రెడ్ మిల్ మెషిన్ మీద కొద్దిసేపు రన్నింగ్ చేశారు. అనంతరం షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ 27 ఎకరాల క్యాంపస్ లో అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశామని..దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఠాకూర్ చెప్పారు. దేశంలోని అన్ని వర్సిటీల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రెజ్లింగ్, టెన్నిస్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఫుట్ బాల్ మొదలైన అనేక విభాగాలకు చెందిన ఆటగాళ్లకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు ఇక్కడ  శిక్షణ తీసుకుని క్రీడల్లో ప్రపంచస్థాయిలో రాణించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ క్రీటలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. మంత్రి అనురాగ్ ఠాకూర్ వెంట ఎంపీ గిరీష్ బాపట్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కర్భారీ కాలే పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం 

బసవ తారకరామ ’ మూవీ బ్యానర్ ప్రారంభం

పీవీ బయోపిక్ లో ఎవరికీ తెలియని విషయాలు