
ఇటీవల ‘ఘాటి’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన అనుష్క శెట్టి.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలం తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాను ఓ లెటర్‌ను పోస్ట్ చేసింది. ‘ఎప్పుడూ స్క్రోలింగ్ చేసే లైఫ్‌కు దూరంగా.. రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలోనే మరిన్ని మంచి కథలతో మరింత ప్రేమతో మీ ముందుకొస్తా. ఎప్పటికీ అందరూ చిరునవ్వుతోనే ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి’ అంటూ ఓ నోట్‌ను పోస్ట్ చేసింది.
ఆమె నటించిన ‘ఘాటి’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో ‘కథనార్ ది వైల్డ్ సార్సరర్’ అనే ఫాంటసీ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె మలయాళ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో నీలా అనే సాధారణ మహిళ పాత్రలో అనుష్క కనిపించనుంది. జైసూర్య, ప్రభుదేవా, వినీత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. గోకులం గోపాలన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సుబ్రహ్మణ్యన్ సంగీతం అందిస్తున్నాడు.