అనుష్క ఎక్స్‌‌ప్రెస్‌‌

అనుష్క ఎక్స్‌‌ప్రెస్‌‌

కెరీర్ పీక్స్‌‌లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీని పెళ్లాడి నటన నుంచి బ్రేక్ తీసుకుంది అనుష్కాశర్మ. కొద్ది రోజుల్లో మళ్లీ కెమెరా ముందుకి వచ్చేస్తుందనుకున్నారంతా. కానీ అందుకు నాలుగేళ్లు పట్టింది అనుష్కకి. అమ్మ కావడమే అందుకు కారణం. మధ్యలో నిర్మాతగా మారి ‘పాతాళ్‌‌ లోక్’ వెబ్ సిరీస్‌‌తో పాటు ‘బుల్‌‌బుల్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌’ అనే వెబ్ మూవీ కూడా తీసింది. ఈ రెండింటికీ ఫిల్మ్‌‌ఫేర్ అవార్డులు వచ్చాయి. ఆ జోష్‌‌లో ‘మాయి’ అనే సిరీస్‌‌ని, ‘కాలా’ అనే మూవీని నిర్మిస్తోంది. అంతేకాదు.. ఇకపై నటిగా కూడా కంటిన్యూ అవ్వబోతోంది. రీసెంట్‌‌గా ‘చక్‌‌దా ఎక్స్‌‌ప్రెస్‌‌’ అనే మూవీకి కమిటయ్యింది అనుష్క. ఈ సినిమా కోసం చాలా కష్టపడి వర్కవుట్లు చేస్తోంది. బెంగాలీ శ్లాంగ్‌‌ కూడా ప్రాక్టీస్ చేస్తోంది. ఎందుకంటే ఇది ప్రముఖ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్. మహిళా క్రికెట్ చరిత్రలో ఆమెదో స్పెషల్ పేజీ. ఫాస్ట్ బౌలర్‌‌‌‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒన్‌‌ డే ఇంటర్నేషనల్స్‌‌లో ఎక్కువ వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌‌‌‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఆవిడ గౌరవార్థం 2018లో పోస్టల్ స్టాంప్‌‌ని కూడా విడుదల చేసింది ఇండియన్ గవర్నమెంట్‌‌. ఆమె పాత్ర చేయడం అంత ఈజీ కాదు. అందుకే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానంటోంది అనుష్క. త్వరలో యూకేలో షూటింగ్ మొదలు కానుంది. నెల రోజుల పాటు అక్కడే కంటిన్యుయస్‌‌గా షూట్ చేస్తారట. ప్రతి పాత్రనీ పర్‌‌‌‌ఫెక్ట్‌‌గా పోషించే అనుష్క నటించడమే తమ సినిమాకి ప్లస్ అంటున్నాడు దర్శకుడు సుశాంత దాస్‌‌.