GHAATI Review: ‘ఘాటి’ X రివ్యూ.. అనుష్క మూవీకి టాక్ ఎలా ఉందంటే?

GHAATI Review: ‘ఘాటి’ X రివ్యూ.. అనుష్క మూవీకి టాక్ ఎలా ఉందంటే?

అనుష్క నటించిన లేటెస్ట్ యాక్షన్ క్రైమ్ డ్రామా ‘ఘాటి’ (GHAATI). డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌ బ్యానర్‌‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ, ఎట్టకేలకు ఇవాళ (సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న) విడుదలైంది.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, ఒకరోజు ముందుగానే ‘ఘాటి’ ప్రీమియర్ షోలు నార్త్ అమెరికాతోపాటు ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రదర్శించబడ్డాయి. ఈ క్రమంలో మూవీ చూసిన ఆడియన్స్ ఎలాంటి రివ్యూలో ఇస్తున్నారో X రివ్యూలో చూసేద్దాం. 

‘ఘాటి’ కథ:

అరకు, గాంజా మాఫియా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కథ రూపొందించారు క్రిష్. ఒక దట్టమైన అడవి ప్రాంతంలో నివసించే కొంతమంది జనాలు గాంజాయి అమ్ముతూ జీవనం సాగిస్తారు. ఇలాంటి క్రమంలోనే వారిని కొంతమంది టార్గెట్ చేసి, విచక్షణ రహితంగా దాడి చేస్తారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలు పోలీసులకు చిక్కకుండా గంజాయిని తరలిస్తూ బతుకుతూ ఉంటారు.

అయితే, ఈ గంజాయి సప్లయ్ వల్ల అమాయక జనాలకు జరగరాని అనర్ధాలు జరుగుతాయి. ఈ క్రమంలో ఆ ప్రాంత ప్రజల్లో మార్పు వస్తుంది. దాంతో వారు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు. తద్వారా వాళ్ల కెరియర్లు ఎలా సాగయనేది తెలియాలంటే ‘ఘాటి’ మూవీ చూడాల్సిందే అని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. 

ఫ‌స్టాఫ్ మొత్తం ఎమోష‌న‌ల్ జ‌ర్నీతో మొదలై, ఇంటర్వెల్కి బిగ్ ట్విస్ట్ ఉండబోతుందట. అలాగే, సెకండాఫ్ ఊహించని రీతిలో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్‌గా ఉంటుందని అంటున్నారు. విక్రమ్‌ ప్రభు, చైతన్య రావు, జగపతిబాబు, రవీంద్రన్ విజయ్ పాత్రలు పవర్ ఫుల్గా ఉండనున్నాయట. ముఖ్యంగా అనుష్క శత్రువులను ఉచకోత కోస్తూ తన వీరత్వాన్ని ప్రదర్శించిందని టాక్. శీలావతి పాత్ర ఎప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకొనేలా ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ..ఇది అనుష్క శెట్టి సినిమా. యాక్షన్, ఎమోషన్ & ఇంటెన్స్ సన్నివేశాల్లో స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. దర్శకత్వం, సంగీతం, కథ అన్నీ హృదయాన్ని హత్తుకునేలా’  ఉన్నాయని తెలిపారు.