
అనుష్క శెట్టి (Anushkashetty)..తన ఫస్ట్ మూవీతోనే పూరీ..నాగ్ కాంబోలో సూపర్ సినిమా చేసి సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తోంది. తను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 ఏళ్ళు అయిన తరగని అందంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను దక్కించుకుంటోంది.
గత 2 ఏళ్ల నుంచి పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ..రీసెంట్ గా వచ్చిన మిస్ శెట్టి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఇవాళ (నవంబర్ 7) అనుష్క బర్త్డే సందర్బంగా భాగమతి సీక్వెల్ 2 ను మేకర్స్ ప్రకటిస్తున్నట్లు సమాచారం. 2018 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భాగమతి మూవీ అనుష్క కెరీర్లోనే సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. దీంతో ఈ సీక్వెల్ను తెరకెక్కించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. త్యరలో ఈ సినిమా సెట్ పైకి రాబోతుంది.
On this majestic day we bow down to the Queen of Indian Cinema ?
— UV Creations (@UV_Creations) November 6, 2023
Happiest Birthday to our Miss.Shetty @MsAnushkaShetty ?
May your reign in cinema be everlasting and your brilliance continue to shine like a thousand stars ✨✨#HappyBirthdayAnushka#HBDAnushkaShetty… pic.twitter.com/VblFtHB4hY
అంతే కాకుండా అనుష్క చిరు 156 వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న మూవీలోను అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. చిరంజీవి మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆ నిర్మాతలతో ఆమెకి మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉండటంతో హీరోయిన్ గా ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. అలాగే తన 50వ మూవీ కూడా ఒకే అయినట్లు సమాచారం.
ఇక అనుష్క కెరీర్లో చాలా సక్సెస్ మూవీస్ ఉన్నప్పటికీ బాహుబలి, అరుంధతి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా..అనుష్క సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ మూవీలో అనుష్క అరుంధతి, జేజమ్మ పాత్రలను పోషించి తనలోని వర్సటాలిటీ యాక్టింగ్ ను ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమా రూ.13 కోట్ల బడ్జెట్ తో తీసి..ఏకంగా రూ.68 కోట్లను వసూలు చేసింది.
ALSO READ :యాత్ర2 నుండి సోనియా గాంధీ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా?
మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అనుష్క.. విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, అరుంధతి, బిల్లా, సింగం, వేదం, ఖలేజా, మిర్చి వంటి సినిమా హిట్ సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకున్నారు. ఇక ‘బాహుబలి’ సినిమాలో దేవసేన పాత్ర ఆమె కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పొచ్చు.