
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajashekhara reddy) జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర(Yatra). దర్శకుడు మహి వీ రాఘవ్(Mahi v raghav) తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి(Mammootty) నటించిన ఈ సినిమాలో అశ్రిత వేముగంటి, అనసూయ భరద్వాజ్ కీ రోల్స్ లో కనిపించారు.
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర2(Yatra) ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మహి వీ రాఘవ్. వైఎస్ మరణాంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan reddy) జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించనున్నారు. ఆయన ఫస్ట్ లుక్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్. దానికి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Sonia Gandhi Character first look from the propaganda film #Yatra2 pic.twitter.com/xN0Gl7PDXl
— Actual India (@ActualIndia) November 7, 2023
తాజాగా ఈ సినిమా నుండి తాజాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అచ్చం సోనియా గాంధీ లాగే ఉన్న ఆ యాక్టర్ ఎవరో తెలియరాలేదు కానీ.. ఆమె లుక్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ పోస్టర్ కు.. అతడ్ని మీరు ఓడించలేకపోతే.. నాశనం చేయండి.. అనే డైలాగ్ ను యాడ్ చేశారు. వైఎస్ జగన్‌ను ఉద్ధేశించే సోనియా గాంధీ చెప్పినట్లుగా ఈ లైన్ అన్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఈ సినిమా 2024 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read :- జేజమ్మ బర్త్డే స్పెషల్..ఆ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ రెడీ