అనుష్క, క్రిష్ కాంబోలో రెండో మూవీ.. సైలెంట్గా మొదలైన షూటింగ్

అనుష్క, క్రిష్ కాంబోలో రెండో మూవీ.. సైలెంట్గా మొదలైన షూటింగ్

గత ఏడాది మిస్‌‌‌‌‌‌‌‌ శెట్టి మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొలిశెట్టి చిత్రంతో ఆకట్టుకున్న అనుష్క(Anushka), కొన్ని నెలల గ్యాప్ తర్వాత తిరిగి మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. కొత్త చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న ఆమె, ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి సైన్ చేయడంతో పాటు షూటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. క్రిష్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

 ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క కనిపించనుందట. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌‌‌‌‌‌‌‌లో గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుగుతోంది. అనుష్కపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు సమాచారం. ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆ సినిమాకు సంగీతం అందించిన కీరవాణి, దీనికీ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు మలయాళంలో ‘కథనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రంలో నటిస్తోంది అనుష్క.