పీఎం మాటల్లో అన్నీ ప్రశ్నలే.. సమాధానాలుండవ్: రాజ్ బబ్బర్

పీఎం మాటల్లో అన్నీ ప్రశ్నలే.. సమాధానాలుండవ్: రాజ్ బబ్బర్

ఆగ్రా (యూపీ): ప్రధాని మోడీ మాటల్లో కేవలం ప్రశ్నలే ఉంటాయని, సమాధానాలుండవన్నారు ఉత్తరప్రదేశ్‌‌ కాంగ్రెస్‌‌ నేత, నటుడు రాజ్‌‌ బబ్బర్‌‌. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తిపై ఉండాల్సింది ఇటువంటి అభిప్రాయం కాదన్నారాయన. పీటీఐకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. 2014 లోక్‌‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌‌లో కాం గ్రెస్‌‌ పార్టీ తుడిచిపెట్టుకు పోలేదని, అమేథి, రాయ్‌‌బరేలీలో గెలిచిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

‘రాఫెల్‌‌ కేసు ను తిరిగి పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం మోడీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. దీనిపై సమాధానం చెప్పకుండా ఆయనే తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తికి తగదు’అన్నారు. ‘ప్రచారంలో ఎవరు ఏ భాష వాడుతున్నారో ప్రజలు గమనిస్తుంటారు . ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు హద్దుమీరి మాట్లాడితే వాళ్లకే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది’ అని బబ్బర్‌‌ అన్నారు. యూపీలోని ఫతేపూర్‌‌ సిక్రీ నుం చి బరిలో ఉన్న బబ్బర్‌‌.. వెస్ట్‌‌ యూపీలో కాం గ్రెస్‌‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ‘రాహుల్‌‌ గాంధీకి తోడుగా ప్రియాంక ఎంట్రీతో యూపీలో కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.