ఏపీ లిక్కర్ పాలసీలపై సీబీఐతో విచారణ జరిపించండి: పురంధేశ్వరి

ఏపీ లిక్కర్ పాలసీలపై సీబీఐతో విచారణ జరిపించండి: పురంధేశ్వరి

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) భేటీ అయ్యారు. రాష్ట్రంలో గత నాలుగున్నర ఏళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు పురందేశ్వరి తెలిపారు. నాలుగున్నర ఏళ్లలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, ప్రభుత్వం అనుసరించిన విధానం తదితర విషయాలపై కేంద్ర హోంమంత్రికి వినతి పత్రం అందజేసినట్లు పురందేశ్వరి పేర్కొన్నారు.

 రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సైతం అమిత్ షా దృష్టికి ఆమె తీసుకెళ్లారు. బీజేపీ కోర్ కమిటీ వివరాలను కూడా అమిత్ షాకు వివరించారు. మరోవైపు పొత్తులపైనా చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్, బీజేపీపై జరుగుతున్న ప్రచారం, పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపైనా ఢిల్లీ నాయకత్వానికి పురంధేశ్వరి తెలిపినట్లుగా తెలుస్తోంది. సోమవారం (అక్టోబర్ 9) సైతం అక్కడే ఉండి పొత్తులపై తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ పెద్దలకు ఆమె చెప్పారని సమాచారం అందుతోంది.