ఇక రేషన్ వాహనాలు కనిపించవు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. 

ఇక రేషన్ వాహనాలు కనిపించవు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం జరిగింది. మంగళవారం ( మే 20 ) జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. జూన్ నెల నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది క్యాబినెట్. ఈమేరకు పౌరసరఫరాల శాఖకు సంబందించిన డీఎంయు వాహనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. వృద్దులు, దివ్యంగులకు మాత్రమే రేషన్ డోర్ డెలివరీ చేయనున్నట్లు స్పష్టం చేశారు మంత్రి. ఈ భేటీలో 24 అజెండాలపై చర్చించి ఆమోదం తెలిపింది క్యాబినెట్.

ALSO READ | నీళ్లే లేనప్పుడు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ఎట్లా కడతాడు..?

SIPBకి సంబంధించిన 11 అంశాలపై చర్చించిన క్యాబినెట్ వాటికి ఆమోదం తెలిపింది. ఏపీ లెధర్ అండ్ ఫుట్ వేర్ పాలసి 4.0 కి ఆమోదం తెలిపింది క్యాబినెట్. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని ఏపీకి మార్చేందుకు ఆమోదం తెలిపింది. 

హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది అవుతున్న క్రమంలో ఏడాది పాలన పై ప్రచారం చేసే అంశం పై క్యాబినెట్ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.