ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇవి ఉంటే చాలు

ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇవి ఉంటే చాలు

అమరావతి: ఓటరు గుర్తింపు కార్డులు లేకున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎపి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది  వెల్లడించారు. జాబితాలో పేరున్న వారందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉండి.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే.. ఈ కింది పత్రాల్లో వేటినైనా ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు. అవి

1. పాస్‌పోర్ట్

2. డ్రైవింగ్ లైసెన్సు
3. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, పిఎస్ యులు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫోటో గల సర్వీసు గుర్తింపు కార్డులు
4. బ్యాంకులు / పోస్టాఫీసులు జారీ చేసిన ఫోటో గల పాస్ పుస్తకాలు.
5. పాన్ కార్డు
6. ఎన్ పి ఆర్ క్రింద ఆర్ జి ఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్
7. ఎంఎన్ఆర్ఇజిఎ జాబ్ కార్డ్
8. కార్మిక మంత్రిత్వ శాఖ పథకం క్రింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్
9. ఫోటో గల పింఛను పత్రం
10. ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్¬సిలకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డులు
11. ఆధార్ కార్డ్