Chiranjeevi, Kandula Durgesh: విశ్వంభర సెట్స్ లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌

Chiranjeevi, Kandula Durgesh: విశ్వంభర సెట్స్ లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌(Kandula Durgesh) ని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి దుర్గేష్‌ నిన్న హైదరాబాద్ లో జరుగుతున్న విశ్వంభర షూటింగ్ సెట్స్ కి వెళ్లారు. ఇందులో భాగంగా కందుల దుర్గేష్‌ తో  చిరంజీవి కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక ఇదే విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మిత్రుడు కందుల దుర్గష్.. ఏపీ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా విశ్వంభర సెట్స్‌ ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. మంత్రిగా ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటూ ఆయనకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారని ఆయన చెప్పారు.. అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.