హైదరాబాద్ లో పవన్ ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్ లో పవన్ ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

జ్వరంతో బాధపడుతోన్న  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు.  సెప్టెంబర్ 28న సాయంత్రం హైదరాబాద్ మాదాపూర్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు చంద్రబాబు.  దాదాపు గంటకు పైగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన  చంద్రబాబు.. ఆయన  ఆరోగ్యం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా మెరుగైన వైద్యం చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు చంద్రబాబు. భేటీలో ఏపీ తాజా రాజకీయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. 

పవన్ కళ్యాణ్ గత ఐదు  రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారని ఆయన కార్యాలయం ప్రకటించింది. పవన్ కు అవసరమైన చికిత్స కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  వైద్యుల సూచన మేరకు పవన్ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.   ఈ క్రమంలోనే చంద్రాబాబు పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. 

ఇటీవల ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కూడా ఇంత వరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు పవన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది.