ప్రతీ తల్లికి రూ.15 వేలు ఇస్తాం: సీఎం జగన్

ప్రతీ తల్లికి రూ.15 వేలు ఇస్తాం: సీఎం జగన్

పిల్లలను బడికి పంపే తల్లులకు జనవరి 26 న రూ.15 వేలు ఇస్తామని ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుపాకలో ఈ రోజు రాజన్న బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. బడికి వెళ్లే పిల్లలంతా విద్యావంతులు కావాలి. వారంతా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. పిల్లల చదువుల కోసం ఏ తల్లి, తండ్రి అప్పులపాలు కాకూడదు. మీ పిల్లలను బడికి పంపండి. వారి భవిష్యత్తును నేను చూసుకుంటానని అన్నారు. మీ పిల్లలను ఏ బడికి పంపినా ఫర్వాలేదు. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా పండుగ దినం నిర్వహించి.. ఆరోజు ప్రతి తల్లి చేతిలో రూ.15000 పెడతాం. ఏ తల్లీ ఇబ్బంది పడకూడదనే ఈ కార్యక్రమం చేస్తున్నామని సీఎం అన్నారు.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి సుచరిత, విద్యాశాఖ మంత్రి సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.