తెలంగాణ ప్రభుత్వంపై స్పందించిన సీఎం జగన్

తెలంగాణ ప్రభుత్వంపై స్పందించిన సీఎం జగన్

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వంపై స్పందించారు ఏపీ సీఎం జగన్. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. 

ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం ఉన్నా.. సీఎం జగన్ హాజరుకాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. పార్టీ పెట్టుకుని సీఎం అయిన జగన్.. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. స్వయంగా హాజరుకాలేకపోయినా.. ఎక్స్ ద్వారా తన శుభాకాంక్షలను.. సీఎం రేవంత్ రెడ్డికి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలియజేశారు సీఎం జగన్.