ఏపీ సీఎం జగన్ కాలికి గాయం..ఒంటిమిట్ట పర్యటన రద్దు

ఏపీ సీఎం జగన్ కాలికి గాయం..ఒంటిమిట్ట పర్యటన రద్దు

ఏపీ సీఎం జగన్ కాలికి గాయం అయ్యింది.  ఏప్రిల్ 4న ఉదయం ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో  సీఎం జగన్ కాలు బెనికినట్టు సీఎంలో ప్రకటించింది. సాయంత్రానికి కాలి నొప్పి తీవ్రమవడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారని పేర్కొంది. ఈ క్రమంలో ఏప్రిల్ 5న ఒంటి మిట్ట పర్యటనను రద్దు చేసినట్లు తెలిపింది. గతంలోనూ కాలికి గాయం కావడంతో చాలా రోజులు ఇబ్బంది పడినట్లు డాక్టర్లు తెలిపారు. 

షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5న సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరాముని ఆలయానికి వెళ్లాల్సి ఉంది.  ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలి. అధికారులు కూడా అందుకు ఏర్పాట్లు చేశారు.

 

https://twitter.com/AndhraPradeshCM/status/1643255467307847683