జైపూర్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని పట్టుకున్నట్లు మంచిర్యల జిల్లా జైపూర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని నేషనల్ హైవేపై శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి కారులో తరలిస్తున్న 2500 బాటిళ్ల(90ఎంఎల్)ను పట్టుకున్నట్లు తెలిపారు.
వాటిని తరలిస్తున్న నిఖిల్ రాజు అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నామన్నారు. పట్టుకున్న మద్య విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని తెలిపారు. మద్యం, కారును సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. తనిఖీల్లో ఎస్సై శ్రీధర్, సిబ్బంది హబీబ్, హోంగార్డు రాజేశ్వరి ఉన్నారు.
