మన పొరుగోళ్లు.. చెడ్డోళ్లు.. అలాంటోళ్లకు నీళ్లిచ్చేది లేదని తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రి

మన పొరుగోళ్లు.. చెడ్డోళ్లు.. అలాంటోళ్లకు నీళ్లిచ్చేది లేదని తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రి
  •     పాక్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి జైశంకర్ వ్యాఖ్య 
  •     ఆ దేశం ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నది 

చెన్నై: మన పొరుగున ఉన్న పాకిస్తాన్ మంచిది కాదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఆ ఉగ్రవాదం నుంచి మన దేశ ప్రజలను రక్షించుకునే హక్కు మనకు ఉన్నదని చెప్పారు. అందుకోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని తెలిపారు. 

శుక్రవారం చెన్నైలో ఐఐటీ మద్రాస్‌‌‌‌‌‌‌‌ గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ను జైశంకర్ ప్రారంభించారు. అనంతరం అక్కడి స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా పాక్ తీరుపై ఫైర్ అయ్యారు. ‘‘మన పొరుగున ఉన్నోళ్లు మంచోళ్లయితే మనం సహకారం అందిస్తాం. అక్కడ పెట్టుబడులు పెడ్తం.. ఆపత్కాలంలో ఆదుకుంటం. 

కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో దేశాలకు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌లు పంపించాం. ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్యూయల్, ఫుడ్ అందించాం. ఆర్థిక సంక్షోభం టైమ్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంకకు లక్షలాది కోట్ల సాయమందించాం. కానీ మన పొరుగున ఉన్నోళ్లు(పాక్) చెడ్డవాళ్లయితే.. మనం ఎందుకు సాయమందిస్తాం? వాళ్లు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుంటే మనం ఎందుకు ఆదుకోవాలి? 

ఆ ఉగ్రవాదం నుంచి మన ప్రజలను రక్షించుకునే హక్కు మనకుంది. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటం” అని వెల్లడించారు. మనపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్‌‌‌‌‌‌‌‌కు నీళ్లిచ్చేది లేదని స్పష్టం చేశారు. ‘‘భారత్ ఎదిగితే తాము కూడా ఎదుగుతామని మన పొరుగున ఉన్న మంచోళ్లు అనుకుంటారు. కానీ మన పొరుగున ఉన్న చెడ్డోళ్లు మాత్రం అలా అనుకోరు” అని పేర్కొన్నారు.