కోల్ బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని వార్డుల వారీగా ఓటరు జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ జాబితా(డ్రాప్ట్ ఎలక్ట్రోల్స్) ప్రకారం 22 వార్డుల్లో 29,785 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 14,761, స్ర్తీలు 15,023, ఇతరులు ఒకరు ఉన్నారు.
ఓటర్ల జాబితాలో పేర్లులేనివారు, తప్పులు, సవరణలు అవసరమైనవారు చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. మున్సిపల్ ఆఫీస్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యంతరాలు స్వీకరించి జాబితా సవరించి పూర్తిచేస్తామన్నారు.
