కరీంనగర్ జిల్లా అల్ఫోర్స్‌‌లో ముందస్తు సంక్రాంతి సంబురాలు

కరీంనగర్ జిల్లా  అల్ఫోర్స్‌‌లో ముందస్తు సంక్రాంతి సంబురాలు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ క్యాంపస్‌‌లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య​అతిథిగా హాజరైన విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి అత్యంత ప్రాముఖ్యమైన పండుగ అని, ఏపీ,- తెలంగాణ,- తమిళనాడు రాష్ట్రాల్లో వైభవంగా జరుపుకుంటారన్నారు. 

ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీమహా విష్ణుమూర్తికి పూజ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో వేసిన ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, బసవన్న విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.