వారంతా దిక్కుమాలిన ఎమ్మెల్యేలు.. అదో దిక్కుమాలిన పార్టీ: జగన్

వారంతా దిక్కుమాలిన ఎమ్మెల్యేలు.. అదో దిక్కుమాలిన పార్టీ: జగన్

ఏపీ అసెంబ్లీ మూడో రోజు కూడా గొడవలతోనే ప్రారంభమయింది. సభలో గొడవ చేస్తున్న టీడీపీ శాసన సభ్యులను ఉద్దేశించి.. వారంతా దిక్కుమాలిన ఎమ్మెల్యేలని.. అదో దిక్కుమాలిన పార్టీ అని సీఎం జగన్ అన్నారు. సభ ప్రారంభమైన కాసేపటినుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు. స్పీకర్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా సభ జరగకుండా అడ్డుకుంటున్నారు. టీడీపీ సభ్యులను సంయమనం పాటించాలని స్పీకర్ కోరారు. వెల్‌లోకి వచ్చి గొడవ చేస్తుండటంతో సహనం కోల్పోయిన స్పీకర్.. సీట్లోంచి లేచి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే గొడవ చేస్తే తాను ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా రెడీ అంటూ హెచ్చరించారు.

ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మేం కూర్చొని వింటుంటే.. పది మంది కూడా లేని టీడీపీ వాళ్లు సభలో గందరగోళం సృష్టిస్తున్నారు’ అని సీఎం జగన్ అన్నారు. అసలు వాళ్లు సభకు ఎందుకు వస్తున్నారో కూడా వారికి తెలియకుండా పోయిందని ఆయన అన్నారు. సభలో ఎవరైనా గొడవ చేయాలని చూస్తే.. వారిని మార్షల్స్‌తో బయటకు పంపించివేయాలని సీఎం జగన్, స్పీకర్‌ని కోరారు.

For More News..

ఓటరు ప్రశ్న: అప్పుడ ఒక రూల్.. ఇప్పుడు ఒక రూలా?

ఇంటర్ బాలుడిపై 11 మంది విద్యార్థుల లైంగిక దాడి

లవర్‌కి వేరే పెళ్లి.. అర్ధరాత్రి ఆమె కుటుంబంపై పెట్రోల్ దాడి..